నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మంగళ వారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిష్టారెడ్డి భాగ్యనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత - kalwakurthy farmer mla yedma kista reddy death
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిష్టారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం కన్నుమూశారు.
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత
ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, మరోసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. 1994, 2004 రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. నియోజకవర్గంలో కరెంట్ కిష్టన్నగా ప్రజల్లో పేరుపొందారు.