తెలంగాణ

telangana

ETV Bharat / state

JEE Advanced Results 2023 : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులకు టాప్ ర్యాంక్

JEE
JEE

By

Published : Jun 18, 2023, 10:31 AM IST

Updated : Jun 18, 2023, 2:11 PM IST

10:28 June 18

JEE Advanced Results Out : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

JEE Advanced Results Released : ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో ఆరు తెలుగు అబ్బాయిలే కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ జోన్​కు చెందిన తెలుగు విద్యార్థి వావిలాల చిద్విలాస్‌ టాప్ ర్యాంక్ సాధించగా... రమేష్ సూర్య తేజ రెండో ర్యాంక్ సాధించాడు. వివిధ కేటగిరీల్లోనూ తెలంగాణ, ఏపీ విద్యార్థులు అగ్రస్థానాల్లో నిలిచారు. అలాగే అమ్మాయిల విభాగంలో తొలి స్థానంలో నిలిచిన నాగ భవ్యశ్రీ 298 మార్కులు తెచ్చుకుంది.

ఈ నెల 4న రెండు షిఫ్టుల్లో జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్ష 80వేల 372 మంది పరీక్ష రాయగా 43 వేల 773 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 36 వేల 264మంది అబ్బాయిలు ఉండగా.. 7 వేల 509మంది అమ్మాయిలు ఉన్నారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచే అత్యధికంగా 10 వేల 432 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత స్థానాల్లో దిల్లీ, బాంబే, ఖారగ్​పూర్, కాన్పూర్, రూర్కే, గువహటి జోన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది రాశారు. అతున్నత స్థాయి ఇంజినీరింగ్ పోటీ ప్రవేశ పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారు.

జాతీయస్థాయిలో ఓపెన్ కేటగిరీలో మొదటి 10 ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు విద్యార్థులే. నాగర్​కర్నూలు జిల్లా విద్యార్థి వావిలాల చిద్విలాస్ రెడ్డి 360కి 341 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు. చిత్తూరు జిల్లాకు చెందిన రమేష్ సూర్య తేజ 338 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. తెలుగు విద్యార్థులు ఎ. వెంకట శివరామ్ అయిదో ర్యాంకు, బిక్కిన అభినవ్ చౌదరి ఏడో ర్యాంకు, ఎన్. బాలాజీ రెడ్డి తొమ్మిదో ర్యాంక్, వెంకటమనీందర్ రెడ్డి పదో ర్యాంకు సాధించారు. మొదటి ర్యాంకుల్లో సుమారు వందకు పైగా ర్యాంకులు సాధించి తెలుగు విద్యార్థులు మెరుపులు మెరిపించారు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేడు, రేపు ఉంటుంది. ఏఏటీ పరీక్ష ఈనెల 21న నిర్వహించి 24న ఫలితాలను ప్రకటిస్తారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలతో పాటు 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 38 సీఎఫ్‌ఐటీల్లో ప్రవేశాల కోసం రేపు జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది.

మొదటి 10 ర్యాంక్​లు సాధించిన టాపర్లు వీళ్లే..

1. వావిలాల చిద్విలాస్‌ రెడ్డి
2. రమేశ్‌ సూర్య తేజ
3. రిషి కర్లా
4. రాఘవ్‌ గోయల్‌
5. అడ్డగడ వెంకట శివరామ్‌
6. ప్రభవ్‌ ఖండేల్వాల్‌
7. బిక్కిన అభినవ్ చౌదరి
8. మలయ్‌ కేడియా
9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి
10. యక్కంటి ఫణి వెంకట మనీంధర్‌ రెడ్డి

ఇవీ చదవండి :

Last Updated : Jun 18, 2023, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details