Organic Farming : సేంద్రియ పద్ధతితో రైతే రా'రాజు' - ఆర్గానిక్ ఫార్మింగ్
Organic Farming : పదో తరగతి చదివిన ఆ రైతు.. సాగులో మాత్రం చాలా పెద్ద పండితుడు. వినూత్న పద్ధతులు.. ఆధునిక సాంగేతికత వినియోగంతో సాగులో లాభాల బాట పడుతున్నాడు. 500 రకాల దేశవాళీ వరి వంగడాలను సంరక్షిస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ కూరగాయలను డోర్ డెలివరీ చేయాలనేదే తన ఆలోచన అంటున్నాడు.
Organic Farming : చదివింది కేవలం పదో తరగతి. ఎంచుకున్నది వ్యవసాయ వృత్తి. ఐతేనేం... సాగులో తనకంటూ ప్రత్యేక ముద్ర వేస్తున్నాడు. వినూత్నపద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ... భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు అందుకున్నాడు. అతడే... నాగర్‌కర్నూల్‌కు జిల్లాకు చెందిన యువరైతు బైరపాగ రాజు. సేంద్రీయ విధానంలో పంటలు పండించడమే కాకుండా.. 500 పైగా దేశవాళీ వరి వండగాలను సంరక్షిస్తున్నాడు. సారవంతమైన నేల, ఆరోగ్యకరమైన భవిష్యత్‌ను ముందు తరాలకు అందించడమే తన లక్ష్యమంటున్న యువరైతు... బైరపాగ రాజుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
- ఇదీ చదవండి :పవార్ ఇంటిపై దాడి కేసు.. గాడిద వీడియో వైరల్