నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుమారు గంట పాటు కురిసిన అకాల వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. నాళాలు మురికి కాల్వలు పొంగిపొర్లాయి.
భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం.. చెరువులను తలపిస్తోన్న రహదారులు భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం.. చెరువులను తలపిస్తోన్న రహదారులు భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం.. చెరువులను తలపిస్తోన్న రహదారులు రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు రావడంతో ద్విచక్ర వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మురికి కాలువలో నీరు రోడ్డుపై నుంచి పారడంతో పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని రోడ్లన్నీ చిత్తడిగా మారాయి.
జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ పనులు నడుస్తుండటంతో అన్ని కాలనీలలో సీసీ రోడ్లు గుంతలు గుంతలుగా మారి అందులో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిపై చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా.. చిరు వ్యాపారస్తుల దుకాణ సముదాయాలలోకి నీరు చేరడంతో వారు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు.
ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపైన, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వర్షపు నీటితో నిండిపోయింది.
ఇదీ చూడండి:హేమంత్ హత్య కేసు నిందితులకు పోలీసు కస్టడీ