అరుదైన బ్రహ్మ కమలం పుష్పం వికసించి అందరినీ ఆకర్షించింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం టీచర్స్ కాలనీలో ఈ అరుదైన పుష్పం వికసించింది. పాపిశెట్టి నరసింహ ఇంటి ఆవరణలో ఆరేళ్ల క్రితం ఈ మొక్కను నాటారు. మొదటిసారిగా రాత్రి వేళలో ఈ పుష్పం వికసించింది.
ఏడాదికి ఒక్కసారి రాత్రిపూట మాత్రమే వికసించే పుష్పం చూశారా - నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాజా వార్తలు
ఏడాదికి ఒక్కసారి మాత్రమే విరబూసే బ్రహ్మకమలాలు.. మనముండే ప్రాంతంలో పూస్తే... ఎలా ఉంటుంది. ఆ అనుభూతి చెప్పలేం చూడాల్సిందే. ఆ దృశ్యాలు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కనిపించాయి. వాటిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఏడాదికి ఒక్కసారి రాత్రిపూట మాత్రమే వికసించే పుష్పం చూశారా
కాలనీలోని మహిళలు, పిల్లలు, పెద్దలు వచ్చి తిలకించారు. ఈ అరుదైన పుష్పం ఏడాదికి ఒకసారి పూయడం, అది కూడా రాత్రి వేళలో వికసించి.. కేవలం రెండు గంటలు మాత్రమే సజీవంగా ఉండటం ప్రత్యేకత. ఇలాంటి అరుదైన మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని ఇంటి యజమాని నరసింహ చెబుతున్నాడు.
ఇదీ చూడండి :దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్