తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం నాసిరకం విత్తనాలు పంపిణీ చేస్తే ఎలా?

ప్రభుత్వం నాసిరకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తూ... నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళన నిర్వహించారు.

నాసిరకం విత్తనాలు

By

Published : Sep 24, 2019, 9:12 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయంటూ... రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్తాకు రూ. 1,500.. పెట్టుబడి పెట్టి ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను కొనుగోలు చేశామని.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే అవి గింజలు లేకుండా మొలకలు వచ్చి పూర్తి నాసిరకంగా ఉన్నాయని రైతన్నలు వాపోయారు. ప్రభుత్వం ఇలాంటి నాసిరకమైన విత్తనాలను సరఫరా చేస్తే ఎలా అంటూ ఆందోళన చేపట్టారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి వచ్చి నాణ్యమైన విత్తనాలను అందజేస్తామని చెప్పగా వారు ఆందోళన విరమించారు.

నాసిరకం విత్తనాలు పంపిణీ చేస్తే ఎలా?

ABOUT THE AUTHOR

...view details