తెలంగాణ

telangana

ETV Bharat / state

వెల్దండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా.. - revenue

తమ భూమి ఇతరుల పేరు మీద రిజిస్టర్ అయినట్లు గుర్తించిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

రైతుల ధర్నా

By

Published : Apr 22, 2019, 7:13 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మండల పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన 37 సర్వే నంబర్​లో భీమా వెంకటయ్య, బాలస్వామి అనే రైతులకు చెందిన 12 ఎకరాల భూమిలో ఎనిమిది ఎకరాలు ఇతరుల పేరున రిజిస్టర్ అయిందని తెలుసుకొని సుమారు 100 మంది కర్షకులతో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ భూమి తలకొండపల్లి గ్రామానికి చెందిన వేరే వ్యక్తుల పేరుతో రిజిస్టర్ అయినట్లు గుర్తించినట్లు రైతులు తెలిపారు. వెల్దండ తహసీల్దార్ నాగ వీరేశం, ఎస్సై వీరబాబు 10 రోజుల్లోగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.

రైతుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details