నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని జేపీ నగర్ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 35,530 నగదు, మూడు చరవాణిలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కల్వకుర్తిలో పేకాట రాయుళ్ల గుట్టురట్టు - నాగర్కర్నూల్లో పేటకారాయుళ్లు అరెస్ట్
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలో పేకాట రాయుళ్ల గుట్టు రట్టైంది. పేకాటు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కల్వకుర్తిలో పేకాట రాయుళ్లు గుట్టురట్టు
వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేందర్ తెలిపారు.