నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో రైతులు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కారు. ప్రభుత్వం అందిస్తోన్న సబ్సిడీ విత్తనాలు తమకు అందడం లేదంటూ ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. వేరుశనగ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. ప్రభుత్యం వెంటనే సబ్సిడీ విత్తనాలు అందజేయాలని... లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
వేరుశనగ విత్తనాల కోసం రైతుల రాస్తారోకో - నాగర్ కర్నూల్ జిల్లా
ప్రభుత్వం అందిస్తోన్న సబ్సిడీ వేరుశనగ విత్తనాలు తమకు అందడం లేదంటూ నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
వేరుశనగ విత్తనాల కోసం రైతుల రాస్తారోకో