తెలంగాణ

telangana

'సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయాలి'

సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా తాండ్ర వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ధర్నాకి దిగారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు.

By

Published : Dec 2, 2020, 1:47 PM IST

Published : Dec 2, 2020, 1:47 PM IST

ETV Bharat / state

'సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయాలి'

farmers protest for cotton sales at thandra in nagarkurnool district
'సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయాలి'

పత్తిని సీసీఐ కొనుగోలు చేయడం లేదని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర వద్ద శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై సుమారు గంటన్నరపాటు ధర్నా చేపట్టారు.

సంఘటనా స్థలానికి కల్వకుర్తి సీఐ సైదులు, వెల్దండ, వంగూరు ఎస్సైలు నరసింహులు, బాలకృష్ణ చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా... ఆందోళన విరమించలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనే విధంగా చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఆర్డీవో రాజేశ్ కుమార్, తహసీల్దార్ రాంరెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ నిరసనతో వాహనాలు భారీగా నిలిచిపోగా... పోలీసులు ట్రాఫిక్​ని నియంత్రించారు.

ఇదీ చదవండి:'వాళ్లు రిగ్గింగ్ చేసినా... గెలిచేది మాత్రం మేమే'

ABOUT THE AUTHOR

...view details