తెలంగాణ

telangana

ETV Bharat / state

యురేనియం వెలికి తీస్తే అనార్థాలు అనంతం..

అమ్రాబాద్ ప్రాంతంలో యురేనియం వెలికి తీయడం వల్ల జరగబోయే అనార్థాలు అనంతమని పలువురు కవులు, కళాకారులు, పాత్రికేయులు అభిప్రాయపడ్డారు.

యురేనియం వెలికి తీస్తే అనార్థాలు అనంతం..

By

Published : Aug 8, 2019, 10:00 PM IST


నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్​ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అచ్చంపేటలో నల్లమల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘ వేదిక అధ్యక్షుడు జయదీర్ తిరుమల్ రావు, కవులు, కళాకారులు, సీనియర్ పాత్రికేయులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో యురేనియం వెలికి తీయడం వల్ల జరగబోయే అనార్థాల గురించి ప్రజలకు చెప్పి వారిని చైతన్యవంతం చేయడమే తమ లక్ష్యమని వారు వివరించారు. యురేనియం తీస్తే ఒక్క అమ్రాబాద్ మండలమే కాదు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని జిల్లాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు కలుషితమై పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని వివరించారు. తెలంగాణకే వన్నె తెచ్చిన నల్లమల కనుమరుగైపోతుందని వాపోయారు. అడవిని నమ్ముకున్న అమాయక చెంచులు ఇక కనిపించరన్నారు.

అనార్థాలు అనంతం..

ABOUT THE AUTHOR

...view details