తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిభవన్​ ముట్టడికి సిద్ధమైన నిర్వాసితులు - venkatadri reservoir

నష్ట పరిహారం చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వట్టెం జలాశయ నిర్వాసితులు ప్రగతి భవన్​ ముట్టిడికి సిద్ధమయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసితులు పాదయాత్రగా భిక్షాటన చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు.

expats-protest

By

Published : May 27, 2019, 11:14 AM IST

Updated : May 27, 2019, 2:45 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా బిజినాపల్లి మండలంలో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్​ నిర్వాసితులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పాదయాత్రగా భిక్షాటన చేస్తూ .. ప్రగతి భవన్​ ముట్టడికి వస్తున్నారు. కారుకొండ, కారుకొండ తండా, రామ్​రెడ్డిపల్లి తండా, ఆంకెనపల్లి తండా, జిగుట్ట తండా, పోతిరెడ్డి పల్లి తండాకు చెందిన సుమారు 300 మంది వట్టెం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రకు అనుమతి లేదని అదనపు కలెక్టర్​, ఏఎస్పీ అభ్యంతరం తెలిపారు. బోడుపర్తిమిట్ట వద్ద నిర్వాసితులతో చర్చలు జరుపుతున్నారు.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా తగ్గేది లేదు

ఇప్పటికే పలు రూపాల్లో నిరసన చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మూకుమ్మడిగా ముట్టడికి సిద్ధమయ్యారు. వీరికి ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తోడయ్యారు. మల్లన్నసాగర్​ తరహాలో పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించక పోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రగతిభవన్​ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రగతిభవన్​ ముట్టడికి సిద్ధమైన నిర్వాసితులు

ఇదీ చదవండి: కరెంట్ ఆగింది.. కోళ్ల ప్రాణం పోయింది...

Last Updated : May 27, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details