నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం శ్రీ రాయలగండి లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో రాత్రి వేళ గుప్త నిధుల కోసం గర్భ గుడి ద్వజ స్ధంబం ముందు భాగంలో గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. అచ్చంపేట-మద్దిమడుగు ప్రధాన రహదారి సమీపంలో ఎతైన కొండపై వెలసిన ఈ దేవాలయం ఆవరణలో గతంలో కూడ తవ్వకాలు జరిపారు. గుప్త నిధుల కోసం నల్లమల ప్రాంతంలోని పురాతన దేవాలయాలను ధ్వంసం చేసే దుండగులనుపోలీసులువిచారిస్తున్నారు. నిందితులను వెంటనే గుర్తించి నల్లమల ప్రాంతంలోని దేవాలయాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
గుప్తనిధుల కోసం చెన్నకేశవ ఆలయంలో తవ్వకాలు - నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం శ్రీ రాయలగండి లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
నవీన కాలంలో దేవాలయాలకు రక్షణ కరువవుతోంది. గుప్తనిధుల కోసం దేవాలయాలను కూడా వదలడం లేదు దుండగులు. నాగర్ కర్నూల్ జిల్లాలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు.
గుప్తనిధుల కోసం చెన్నకేశవ ఆలయంలో తవ్వకాలు