నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో వెలిసిన ఈదమ్మ తల్లి సీత మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పురపాలక ఛైర్మన్ విజయలక్ష్మి.. రథం ముందు ప్రత్యేక పూజలు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు అచ్చంపేట, లింగాల, కర్నూలు, పెబ్బేరు నుంచి భక్తులు తరలొచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
ఘనంగా ఈదమ్మ తల్లి సీత మహోత్సవం - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు
కొల్లాపూర్లో ఈదమ్మ తల్లి సీత మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పురపాలక ఛైర్మన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఘనంగా ఈదమ్మ తల్లి సీత మహోత్సవం
భక్తుల ఇలవేల్పుగా ఉన్న ఈదమ్మ తల్లి కరుణ కటాక్షం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈదమ్మ తల్లి గుడి నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పురపాలిక సిబ్బంది.. అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:మన కొలతలు.. మన చెప్పుచేతల్లో!