తెలంగాణ

telangana

ETV Bharat / state

విభజన హామీలపై చర్చకు సిద్ధం... ఎక్కడికైనా వస్తాం: రఘునందన్ - నాగర్​కర్నూల్ జిల్లా వార్తలు

విభజన చట్టం హామీలపై చర్చకు ఎక్కడికైనా వస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. జర్నలిస్టులపై ఉదయం ప్రేమ చూపించిన కేటీఆర్... సాయంత్రం దాడి జరిగితే స్పందించలేదని ప్రశ్నించారు. భైంసా ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

dubbaka mla raghunandan rao fires on trs government in nagarkurnool district
విభజన హామీలపై చర్చకు సిద్ధం... ఎక్కడికైనా వస్తాం: రఘునందన్

By

Published : Mar 8, 2021, 2:21 PM IST

విభజన చట్టం హామీలపై చర్చకు సిద్ధమని... ఎక్కడికైనా వస్తామని... సమయం స్థలం చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐదేళ్ల తర్వాత జర్నలిస్టులపై మంత్రి కేటీఆర్​కు ప్రేమ పుట్టుకొచ్చిందని... అది కేవలం శాసనమండలి ఎన్నికల కోసమేనని విమర్శించారు.

జర్నలిస్టులపై ఉదయం ప్రేమ చూపించిన కేటీఆర్... సాయంత్రం వారిపై దాడి జరిగితే స్పందించలేదని ప్రశ్నించారు. భైంసా సంఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భైంసాలో ఎవరిని రక్షించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న కుటుంబ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డాక్టర్లకు, న్యాయవాదులకు, జర్నలిస్టులకు రక్షణ కరవైందని ఆరోపించారు.

ఇదీ చదవండి:భారత్​-పాక్ సరిహద్దు గస్తీలో మహిళా జవాన్లు

ABOUT THE AUTHOR

...view details