నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి లాక్కెళ్లిన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. స్థానిక బస్ డిపో ముందు కాలనీలో నందిని అనే చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్క దాడి చేసింది. దాడి చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. కుక్క దాడిచేయడంతో చిన్నారి అరుపులకు స్థానికులు వచ్చి నందినిని కాపాడారు.
బాలికపై వీధి కుక్క దాడి.. తల్లడిల్లిన చిన్నారి
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచింది. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
కుక్కలు, చిన్నారి
వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కల దాడిలో చిన్నారి కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పురపాలక అధికారులు స్పందించి వెంటనే కుక్కలు, పందుల స్వైర విహారాన్ని అరికట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న సంప్రదాయ కంబళ క్రీడ