తెలంగాణ

telangana

ETV Bharat / state

చెంచులలో విద్యావంతులకు రాజ్​భవన్​లో శిక్షణ! - బౌరపూర్, అప్పపూర్ చెంచుపెంటలు

నాగర్ కర్నూల్​ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని బౌరపూర్, అప్పపూర్ చెంచుగ్రామాల్లో రెడ్​క్రాస్ సొసైటీ ప్రతినిధులు పర్యటించారు. చెంచుల జీవిత కాలం తక్కువగా ఉందని.. గర్భిణులు, పిల్లలకు పోషకాహారం సరిగా అందటం లేదని సర్వేలో వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. చెంచులలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు నాగర్ కర్నూల్​ జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

red cross society, hygiene kits, chenchu people in nagar kurnool
నాగర్ కర్నూల్​ జిల్లా, చెంచుల వార్తలు, రెడ్​క్రాస్ సొసైటీ

By

Published : Apr 5, 2021, 5:45 PM IST

చెంచులలో విద్యావంతులైన యువతకు రాజ్​భవన్​ నందు శిక్షణ కార్యక్రమం నిర్వహించి.. పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తామని రెడ్​క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. వారిలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో ఎన్ఐఎన్​ వారి సహకారంతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

అందులో భాగంగా నాగర్ కర్నూల్​ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని బౌరపూర్, అప్పపూర్ చెంచు గ్రామాల్లో రెడ్​క్రాస్ సొసైటీ జనరల్ సెక్రెటరీ మదన్ మోహన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, రెడ్​క్రాస్ ఛైర్మన్ డాక్టర్ సుధాకర్ లాల్ పర్యటించారు. చెంచులకు హైజీన్ కిట్లు, మాస్కులు పంపిణీ చేశారు. గర్భిణులు, పిల్లలకు పండ్లు అందజేశారు.

చెంచుల జీవిత కాలం తక్కువగా ఉందని.. గర్భిణులు, పిల్లలకు పోషకాహారం సరిగా అందటం లేదని సర్వేలో వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించడం కోసం చెంచులలో విద్యావంతులైన యువతను ఎంపిక చేశామని.. వారికి రాజ్​భవన్ నందు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వారిలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించి.. చెంచు ప్రజలకు వారి సేవలను వినియోగిస్తామన్నారు.

ఇదీ చూడండి:'రాష్ట్రం కోసం జానారెడ్డి సీఎం పదవిని త్యాగం చేశారు'

ABOUT THE AUTHOR

...view details