తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి గ్రామపంచాయతీలో కరోనా హెల్ప్​లైన్'

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శ్రీధర్ సందర్శించారు. కొవిడ్ బాధితుల కోసం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.​

Corona helpline in every village says collector sridhar
'ప్రతి గ్రామపంచాయతీలో కరోనా హెల్ప్​లైన్'

By

Published : Mar 23, 2020, 4:52 PM IST

'ప్రతి గ్రామపంచాయతీలో కరోనా హెల్ప్​లైన్'

కరోనా వ్యాప్తి నివారణపై ప్రతి గ్రామపంచాయతీలో హెల్ప్​లైన్ ఏర్పాటు చేశామన్నారు నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ శ్రీధర్. కొవిడ్ బాధితుల కోసం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.​ జిల్లా ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డును ఆయన పరిశీలించారు. ఐసోలేషన్‌ వార్డులో మంచాలు, బెడ్‌ షీట్లు, ఐసీయూ వార్డు, స్నానపు గదులను ఎప్పటికప్పుడు శుభ్ర పరచాలని సూచించారు.

అనంతరం ఆస్పత్రి వైద్యులతో సమావేశం నిర్వహించారు. కొవిడ్- 19కు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రతి వార్డుకు నలుగురు డాక్టర్లను కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఎవరూ కూడా విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకూడదన్నారు. తాడూర్ కస్తూర్భా గాంధీ విద్యాలయంలో క్వారంటైన్​ సెంటర్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:సుప్రీంలో ఒకే ధర్మాసనం.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ

ABOUT THE AUTHOR

...view details