నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టిన నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అలాగే వెల్దండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు పోలీస్ స్టేషన్లోనే నిరసనను కొనసాగించారు.
పోలీస్ స్టేషన్లో నిరసన కొనసాగించిన కాంగ్రెస్ నాయకులు - కల్వకుర్తి కాంగ్రెస్ నాయకుల నిరసన వార్తలు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కల్వకుర్తి, వెల్దండ మండలకేంద్రాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో వారు అక్కడే నిరసన కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన అమలు చేస్తుందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన అమలు చేస్తుందని, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడితే.. పోలీసులతో ఆపే ప్రయత్నం చేస్తుందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రశ్నించే విధానానికి ముగింపు పలికి అణచివేసే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు కేఎల్ఐ వద్ద నీటమునిగిన మోటార్లకు ఇప్పటికైనా మరమ్మతులు చేసి సాగు, తాగునీరు అందించాలని విజయ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:కేఎల్‌ఐ పరిశీలన యత్నం.. విపక్షనేతల అరెస్టు..ఉద్రిక్తత