నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు కంటైన్మెంట్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్తో కలిసి పరిశీలించారు. 20 రోజులుగా జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం వల్ల రెడ్జోన్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాను సేఫ్ జోన్‌గా ఉంచాలి: కలెక్టర్ శ్రీధర్ - nagarkurnool district collector sridhar
కరోనా మహమ్మారి కట్టడిలో నాగర్‌కర్నూల్ జిల్లా పూర్తి స్థాయిలో విజయం సాధించిందని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా ప్రభుత్వ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
నాగర్‌కర్నూల్‌లో కలెక్టర్ పర్యటన
హోంక్వారంటైన్లో ఉన్నవారు మరికొన్ని రోజులు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ సూచించారు. భౌతిక దూరం పాటించి జిల్లాను సేఫ్ జోన్‌గా ఉంచాలని కోరారు.
అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును కలెక్టర్ తనిఖీ చేశారు. కర్నూల్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఉంచాలని ఎస్పీని ఆదేశించారు. సరిహద్దు గ్రామాల్లోకి అపరిచితులెవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.