నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోటి వృక్షార్చనలో భాగంగా పార్లమెంట్ సభ్యులు రాములు, జడ్పీ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణానది నుంచి వస్తున్న సాగు నీళ్లతో సమృద్ధిగా పంటలు పండుతుండటంతో సీఎం చిత్రపటానికి కృష్ణా జలాలతో జలాభిషేకం, జిల్లాలో పండిన పంటలతో ధాన్యాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం 67 కిలోల కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ రాములు పాల్గొన్నారు. వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు
అనంతరం ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-2021 జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలోని సుమారు 150 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. వారం రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్‌రెడ్డి, కవి, గాయకుడు సాయిచంద్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ నూరేళ్లు జీవించాలి'