ఆమె శతాధిక వృద్ధురాలు. అయినా తన పనులన్నీ తానే చేసుకుంటారు. 106 ఏళ్లు నిండినా ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. 1914లో జన్మించిన ఆమెకు పదిమంది సంతానం. అంతా కలిపి 186 మంది కుటుంబం. వాళ్లంతా ఆమె నూరేళ్లు పైబడినందున(100 years celebration) ఘనంగా వేడుక నిర్వహించారు. ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వారి కుమారులు, కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, మనవలు, మునిమనుమలు అంతా కలిపి 186 మంది కుటుంబం.
100 years celebration: 186 మంది కుటుంబసభ్యుల మధ్య వందేళ్ల బామ్మ బర్త్డే సెలబ్రేషన్స్
ప్రస్తుత పరిస్థితుల్లో నలభై ఏళ్లు దాటగానే రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇక అరవై ఏళ్లు పైబడితే తమ పనులు తాము చేసుకోవడం గగనమే. తొంభై ఏళ్లయితే వారికి ఒకరి సాయం అవసరం. కానీ ఈ బామ్మకు మాత్రం ఆ అవసరం లేదు. శతాధిక వృద్ధురాలైనా ఆమె తన పనులు తానే చేసుకుంటారు. 186 మంది కుటుంబసభ్యులు గల ఆ బామ్మకు వందేళ్లు(100 years celebration) పైబడిన సందర్భంగా ఘనంగా వేడుక నిర్వహించారు.
వాళ్లంతా ఆమె నూరేళ్లు పైబడిన పండగను(100 years celebration) ఘనంగా నిర్వహించాలని భావించారు. ఇంకేం ఆమె సొంత గ్రామంలోనే వేడుక జరిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ కాలనీలో 106ఏళ్ల వెంకటరమణమ్మ వందేళ్లు పైబడినందున వేడుక ఆదివారం ఘనంగా జరిపించారు. ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాలకు పెద్దదిక్కుగా ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. రోజంతా ఆమెతో ఎంతో ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులందరి మధ్య నూరేళ్ల వేడుక చేసుకోవడం ఆనందంగా ఉందంటూ వెంకటరమణమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
TAGGED:
nagarkurnool district news