తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్షణమే గొర్రె యూనిట్లు పంపిణీ చేయండి: భాజపా ఓబీసీ మోర్చా - గొర్రెల యూనిట్లపై భాజపా ఆందోళన

మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గొర్రెల యూనిట్లను తక్షణమే అందించాలని భాజపా ఓబీసీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. గొల్ల కురుమల పట్ల రాష్ట్రప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు.

bjp obc morcha leaders demands to sanction immediately sheep units for golla kuruma in nagar kurnool district
తక్షణమే గొర్రె యూనిట్లు పంపిణీ చేయండి : భాజపా ఓబీసీ మోర్చా

By

Published : Mar 1, 2021, 4:16 PM IST

గొల్ల కురుమలకు వెంటనే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని భాజపా ఓబీసీ మోర్చా డిమాండ్ చేసింది. డిపాజిట్లు కట్టించుకుని మంజూరు చేయకపోవడంతో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. భాజపా కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్‌ ముందు బైఠాయించారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గొర్రెల యూనిట్లను తక్షణమే అందించాలన్నారు.

గొల్ల కురుమల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి ప్రత్యేక పింఛన్‌ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో గొర్రెలు మేపేందుకు 20 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించి.. డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలంటూ కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి :రెండు వారాల్లో నివేదికివ్వండి: హైకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details