అచ్చంపేట పుర ఎన్నికల్లో ఓటుకు నోట్లిచ్చి తెరాస గెలవాలని చూస్తోందని మాజీ ఎంపీ, భాజపా రాష్ట్ర నాయకులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆయన పట్టణంలో పర్యటించారు. నిన్న జరిగిన తెరాస, భాజపా ఘర్షణలో పోలీసుల లాఠీఛార్జీలో గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న భాజపా కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం 2వ వార్డులో భాజపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
ఓటుకు నోటిచ్చి తెరాస గెలవాలని చూస్తోంది : మాజీ ఎంపీ వివేక్ - అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాజపా ప్రచారం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఓటర్లకు డబ్బులు ఎరగా వేసి తెరాస గెలవాలని చూస్తోందని భాజపా నాయకులు ఆరోపించారు. నిన్న జరిగిన ఇరు పార్టీల ఘర్షణలో గాయాల పాలైన భాజపా కార్యకర్తలను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.
అచ్చంపేట పుర ఎన్నికల్లో భాజపా ప్రచారం
తెరాస నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని వెంకటస్వామి ఆరోపించారు. నిన్న జరిగిన ఘర్షణలో పోలీసులు.. తెరాస మద్దతుదారులుగా వ్యవహరించారని మండిపడ్డారు. సభకు అనుమతి ఇచ్చి తమ కార్యకర్తలను లాఠీఛార్జి చేయడం అమానుషం అన్నారు. అచ్చంపేట పుర ఎన్నికల్లో తెరాస డబ్బు పంపిణీ చేసి దొడ్డి దారిన గెలవాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పట్టణ ప్రజలు భాజపాను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ఆక్సిజన్, కొవిడ్ పడకల కొరత లేదు : కిషన్ రెడ్డి