తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టుకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు - ఫౌండేషన్​

వృక్షం మరికొన్ని రోజుల్లో విరిగిపోతుందనుకున్నారు.. కానీ కట్టెలుగా మారే చెట్టును బతికించుకున్నారు. పచ్చదనంతో చల్లని నీడనిస్తూ.. రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది.

చెట్టుకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు

By

Published : Jul 29, 2019, 4:52 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అడుగు పెడితే చాలు.. చుట్టూ పచ్చటి చెట్లు స్వాగతం పలుకుతాయి. సుందరమైన ఉద్యానవనానికి వచ్చామా అన్నట్లుగా అనిపిస్తుంది. రెండేళ్ల క్రితం... 35 ఏళ్ల పులిచింతాకు వృక్షం పెద్ద గాలి దుమారానికి నేలకొరిగి విరిగిపోయింది. అక్కడ ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో బాధ పడ్డారు. చేసేదేమీ లేక విరిగిన చెట్టును పూర్తిగా తీసేయాలని పూనుకున్నారు.

చెట్టుకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు

ఈనాడు పేపర్​లో వచ్చిన వార్తను చదివాను
ఇదే పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యశోధర విరిగి నేలకొరిగిన చెట్లను తిరిగి రిప్లాంట్ చేయొచ్చని తెలిపారు. ఇలా చెట్లను బతికించే ఫౌండేషన్ ఉందని గతంలో ఈనాడు పేపర్​లో వచ్చిన వార్తను చదివానని చెప్పిన ఆమె ఆ ఫౌండేషన్​ను సంప్రదించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఫౌండేషన్ బృందం ఆ చెట్టును మళ్లీ అదేచోట రీ ప్లాంట్ చేశారు. ఆ చెట్టు మెల్లమెల్లగా పూత పూసి కొమ్మలతో మహావృక్షంగా మారింది. జూలై 28 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకుని మూడోపడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చెట్టుకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కూలిన చెట్టును వదిలేయకుండా.. తిరిగి బతికుంచుకున్న నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అందరూ అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి : నగరంలో వ్యక్తి కిడ్నాప్... కోటి రూపాయలు వసూలు!

ABOUT THE AUTHOR

...view details