కేసీఆర్‌కు టైం అయిపోయింది : భట్టి - bhatti vikramarka
కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రాజీనామ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హస్తం గుర్తుతో గెలిచి తెరాసలో చేరడమేంటని ప్రశ్నించారు.
సమావేశంలో భట్టి విక్రమార్క
కేసీఆర్‌కు టైం అయిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్‌లో మాట్లాడారు. కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని... గత ఐదేళ్ల నుంచి డిజైనింగ్ పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇతర పార్టీల్లో గెలిచిన నాయకులను తెరాసలో చేర్చుకోవడం నేరమన్నారు.