తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతును రాజును చేయడమే సీఎం ధ్యేయం: మంత్రి నిరంజన్ రెడ్డి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్ మండల కేంద్రాల్లో రైతు వేదికల భవనాలను ఆయన ప్రారంభించారు.

Agriculture minister niranjan reddy Foundation for raithu vedika buildings
రైతు రాజును చేయడమే సీఎం ధ్యేయం: నిరంజన్ రెడ్డి

By

Published : Jun 29, 2020, 11:32 AM IST

రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్ మండల కేంద్రాల్లో రైతు వేదికల భవనాలకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములుతో కలిసి శంకుస్థాపన చేశారు.

దేశం గర్వించే నేతగా సీఎం కేసీఆర్ చరిత్రకెక్కారని కొనియాడారు. కరోనా సంక్షోభంలో కూడా 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,500 కోట్లను కేవలం 34 గంటల్లో జమచేసినట్లు ఆయన తెలిపారు. రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఇవీ చూడండి:హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details