నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో ఓ యువతి ఆపస్మారక స్థితిలో పడి ఉంది. ఓ యువకుడు బాధిత యువతిని పెబ్బేర్లోని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. బాధితురాలు ఆసుపత్రిలో మృతి చెందింది. విషయం తెలిసిన యువకుడు ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. మృతురాలు కల్వకోలు సమీపంలోని గ్రామం చెన్నపు రావుపల్లికి చెందిన కృష్ణవేణిగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి...యువకుడి పరారీ - PEDDHA KOTHAPALLI
నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పరిధిలో ఆపస్మారక స్థితిలో ఉన్న ఓ 18 ఏళ్ల యువతిని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాడో యువకుడు. ఆసుపత్రికి తరలించాక బాధిత యువతి మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఆమెను తీసుకువచ్చిన యువకుడు పరారైన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది.
కేసు దర్యాప్తు చేస్తోన్న పోలీసులు