తెలంగాణ

telangana

ETV Bharat / state

కూలీలతో వెళ్తూ బోల్తా పడిన బొలెరో - bolero accident

కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కొల్లాపూర్​లో చోటు చేసుకుంది.

కూలీలతో వెళ్తూ బోల్తా పడిన బొలెరో

By

Published : Nov 18, 2019, 4:12 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు బొలెరో వాహనంలో పత్తి తీసేందుకు బయలుదేరారు. బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి వెళ్తుండగా డ్రైవర్ బ్రేక్​ వేయడంతో బొలెరో ఒక్కసారిగా అదుపుతప్పినట్లు క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

కూలీలతో వెళ్తూ బోల్తా పడిన బొలెరో

ABOUT THE AUTHOR

...view details