రాష్ట్రంలోని నల్లమలను పర్యటక హబ్, టూరిజం జోన్‌గా అభివృద్ధి చేస్తామని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అలాగే విదేశీయులు బస చేసేలా తయారు చేస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో 50 కోట్లతో నిర్మించిన రిసార్ట్స్‌ను జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
అమ్రాబాద్‌లో 50 కోట్లతో రిసార్ట్ ప్రారంభం - నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్
నల్లమల, పాపికొండల ప్రాంతాలను గోవాను తలదన్నే విధంగా అభివృద్ధి చేస్తామని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో 50 కోట్లతో నిర్మించిన రిసార్ట్సును ప్రారంభించారు.
అమ్రబాద్‌లో 50 కోట్లతో రిసార్ట్ ప్రారంభం
తెలంగాణలో పర్యటక ప్రాంతాల అభివృద్దికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూరిజం ప్యాకేజీలను చేపడతామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో నల్లమల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని.. పాపికొండలను గోవాను తలదన్నే విధంగా అభివృద్ధి పరుస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు