ఇప్పపూల సేకరణ కోసం నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లిన గిరిజనులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు గిరిజన సంఘాలు, బాధిత గిరిజనులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
విచక్షణ రహితంగా...
ఇప్పపూల సేకరణ కోసం నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లిన గిరిజనులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు గిరిజన సంఘాలు, బాధిత గిరిజనులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
విచక్షణ రహితంగా...
గిరిజనుల జీవన విధానంలో భాగంగా నిత్యం అడవితో సంబంధం ఉంటాయని... అందులో భాగంగా సంప్రదాయ హొలీ పండుగ సందర్భంగా.. దేవతలకు సమర్పించే ఇప్ప పువ్వుల కోసం ఈ నెల 26న అచ్చంపేట చెంచు పలుగు తండాకు చెందిన 23 మంది గిరిజనులు అడవికి వెళ్లారని వారు కమిషన్కు వారు తెలిపారు. 12 మంది అటవీ అధికారులు గిరిజనులపై దాడి చేసి, నిర్బంధించడమే కాకుండా... అడవిలో అర్ధరాత్రి వరకు లాఠీలు , కర్రలతో విచక్షణ రహితంగా చితకబాదారని తెలిపారు. మహిళలని చూడకుండా బట్టలు చింపి కొట్టడమే కాకుండా... వెంట తీసుకెళ్లిన బట్టలను, దుప్పట్లను తగలబెట్టి బూటు కాళ్లతో కడుపు , మర్మాంగలాపై తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనులు తప్పు చేస్తే చట్టపరమైన కేసులు పెట్టి జైలుకు పంపాలే తప్ప ... చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని గిరిజనులపై దాడి చేయడం చట్టవిరుద్దం అన్నారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని గిరిజనులపై దాడి చేసిన అటవీశాఖ అధికారులపై కేసులు నమోదు చేసేవిధంగా సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వారు కమిషన్ను కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:మలిదశ మమతానుబంధం