నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం తోటపల్లి వెళ్లేదారిలో 13మంది యువకులు ఆదివారం రాత్రి పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో పది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.
కొల్లాపూర్లో 10 మంది పేకాట రాయుళ్ల అరెస్టు - 10 Bingo Players Arrested latest news
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో 10 మందిని అరెస్టు చేయగా... మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 62,000 నగదు, 10 చరవాణులు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కొల్లాపూర్లో 10 మంది పేకాట రాయుళ్లు అరెస్టు
అలాగే 62,000 నగదు, 10 చరవాణులు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. పేకాట ఆడేవారి పట్ల, రోడ్లపై మద్యం తాగే వారిపట్ల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.