తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు రేంజ్​లో పర్యటించిన వరంగల్ సీసీఎఫ్ - మొక్కల ఎదుగుదల

వన్యప్రాణుల కోసం నీటి వసతిని, గడ్డి మైదానాన్ని ఏర్పాటు చేయాలని వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అటవీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Warangal CCF visits Mulugu Range
ములుగు రేంజ్​లో పర్యటించిన వరంగల్ సీసీఎఫ్

By

Published : Feb 4, 2021, 11:00 PM IST

ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్ పర్యటించారు. జాకారం నర్సరీని సందర్శించి.. మొక్కల ఎదుగుదలను పరిశీలించారు. నర్సరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి వివరించారు.

విత్తనాలు పెట్టినప్పుడు తప్పనిసరిగా నీళ్లు చల్లాలని అక్బర్ సూచించారు. కలుపు మొక్కలను మొదట్లోనే తొలగించాలని సిబ్బందికి గుర్తు చేశారు. మొక్కలు పొడవుగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం పోట్లపూర్ బీట్​లో జరుగుతోన్న అటవీ పునరుద్ధరణ పనులను అక్బర్​ పరిశీలించారు. చెదల నిర్మూలణకు తగు సూచనలు చేశారు. వన్యప్రాణుల కోసం నీటి వసతిని, గడ్డి మైదానాన్ని ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

అటవీ బ్లాక్​లో కందకాలు తవ్వించి నీటి సంరక్షణకు తోడ్పడాలని అక్బర్​ పేర్కొన్నారు. కందకం గట్లపైన మొక్కలు నాటాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో.. కెమెరా ట్రాప్స్​ను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ములుగు డీఎఫ్​ఓ ప్రదీప్ కుమార్​, ఎఫ్​డీఓ నిఖిత, రేంజ్ ఆఫీసర్ రాం మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మహారాష్ట్ర స్పీకర్​ రాజీనామా.. కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details