తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మెడివాగు... ఇద్దరు గల్లంతు - ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మెడివాగు... ఇద్దరు గల్లంతు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

unexpected flow of floods in medivagu in jangalapalli mulugu district
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మెడివాగు... ఇద్దరు గల్లంతు

By

Published : Aug 21, 2020, 8:26 AM IST

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు మండలం జంగాలపల్లి వద్ద మెడివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం సమీపంలోని జాతీయ రహదారిపై నుంచి వెళ్లతుండటం వల్ల అప్రమత్తమైన అధికారులు.. రాకపోకలను నిలిపివేశారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మెడివాగు... ఇద్దరు గల్లంతు

బండారుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు మెడివాగులో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. మత్స్యకారులు, యన్​డీఆర్​ఐ బృందం సహాయంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేదు. ఈ గాలింపు చర్యల్లో ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, ఎస్సై బండారు రాజు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details