తెలంగాణ

telangana

ETV Bharat / state

'సహాయక చర్యల్లో పాల్గొన్నారు... తక్షణ సాయం చేశారు'

అగ్నిప్రమాదమని తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వారికి యాభై కిలోల బియ్యం, రెండు వేల రూపాయలను అందించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

two-houses-burned-in-the-fire-at-mulugu
'సహాయక చర్యల్లో పాల్గొన్నారు... తక్షణ సాయం చేశారు'

By

Published : Apr 1, 2021, 12:42 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా ఏఎస్పీ సాయి చైతన్య, తాడ్వాయి, పస్రా ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

బాధితుల ఇళ్లలోని వరి ధాన్యాన్ని బయటకు తీయించి... తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, 2వేల రూపాయలను అందజేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని... మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండాకాలం అగ్నిప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని... ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఇదీ చూడండి:ఆఫీసులో కాల్పులు- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details