తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడు భూములపై అటవీశాఖ అధికారుల దౌర్జన్యం.. లాక్కొవద్దని గిరిజనుల ఆవేదన - అటవీశాఖ అధికారుల తీరుపై ఆరోపణలుట

తమ పోడు భూములు లాక్కొవద్దని గిరిజన రైతులు అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఇరవై ఏళ్లుగా వీటిపైనే తాము ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్యపల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా తమ భూములు ఆక్రమిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

Tribals farmers allegations on  in forest officers
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్యపల్లి గ్రామంలో గిరిజనుల ఆవేదన

By

Published : Jun 14, 2021, 4:27 PM IST

Updated : Jun 14, 2021, 4:41 PM IST

పోడు భూములను సాగు చేసుకుని 20 ఏళ్లుగా పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాకుంటున్నారని.. భూమిని లాక్కొని మా పొట్టలు కొట్టవద్దని అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. అయినప్పటికీ తమను బెదిరిస్తూ భూముల్లో ట్రెంచీలు కొడుతున్నారని వాపోయారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం మల్లయ్యపల్లిలో పోడు భూములపై అటవీశాఖ అధికారుల తీరును వ్యతిరేకిస్తున్నారు.

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్యపల్లి గ్రామంలో గిరిజనుల ఆవేదన
గతంలో 2001, 2003 నుంచి పోడు భూమిని సాగు చేసుకుని పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజన రైతులు చెబుతున్నారు. మల్లయ్య పల్లి గ్రామం ములుగు జిల్లాలో ఉన్నప్పటికీ పోడు భూమి మాత్రం భూపాలపల్లి జిల్లా రేంజ్‌లో ఉంది. గ్రామానికి చెందిన 15 మంది రైతులు 20 ఏళ్ల సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం భూపాలపల్లి రేంజిలో ఉన్న ఈ భూములపై అటవీశాఖ అధికారుల కన్నుపడింది. సాగు చేసుకుంటున్న భూమి మొత్తం 20 ఎకరాల వరకు ఉంటుంది. వాటితో పాటు 50 ఎకరాల అటవీ భూమిని అధికారులు చదును చేస్తున్నారు. మొత్తం 70 ఎకరాల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటేందుకు చుట్టూ ట్రెంచి కొట్టారు. చరవాణి ద్వారా రేంజ్ ఆఫీసర్‌ను సంప్రదించగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు చదును చేస్తున్నామని అన్నారు. పెద్ద చెట్లను తొలగించి చిన్న మొక్కలు పెట్టడం ఏంటని అడగగా ఆ ఉన్న ప్రదేశంలో పెద్ద చెట్లు లేవని ఉన్న చిన్న చిన్న చెట్ల పొదలను తొలగిస్తున్నామని అన్నారు. పెద్ద చెట్లను తొలగించినట్లు కళ్లకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటే అటవీశాఖ అధికారులు మాత్రం మాట దాటవేస్తున్నారు.


మా గ్రామంలో 80 కుటుంబాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన 15 కుటుంబాలకు భూమి లేకపోవడంతో 20 ఏళ్ల క్రితమే సాగు చేసుకున్నామని గిరిజనులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది అటవీశాఖ అధికారులు బెదిరింపులు, భయబ్రాంతులకు గురి చేసే వారని ఆరోపిస్తున్నారు. అయినా సరే తాము వదిలి పెట్టి పోయేవారం కాదని అన్నారు. ఇప్పుడు వచ్చిన అధికారి సుజాత మా మీద కేసులు పెడుతోందని గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. పోడు భూమిలో సాగు చేసుకుంటున్న 15 మంది రైతులకు ఎక్కడైనా భూమి ఉంటే.. అటవీశాఖ అధికారులు తహసీల్దార్ వద్దకు వెళ్లి మా భూములు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న తాము ఈ భూమిని వదిలిపెట్టి వెళ్లమని.. లేనిపక్షంలో చావడానికైనా సిద్ధమేనని హెచ్చరిస్తున్నారు.



ఇదీ చూడండి:Harish Rao: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల సర్వే పనులు ప్రారంభం​

Last Updated : Jun 14, 2021, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details