తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy: 'మేడారం జాతరకూ జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే' - telangana news

Revanth Reddy: ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి డిమాండ్​ చేసారు. వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని రేవంత్​ సమర్పించుకున్నారు. దక్షిణాది కుంభమేళా మేడారం జాతర అని ఆయన వెల్లడించారు.

Revanth Reddy: 'మేడారం జాతరకూ జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే'
Revanth Reddy: 'మేడారం జాతరకూ జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే'

By

Published : Feb 19, 2022, 3:07 PM IST

Revanth Reddy: మేడారం మహాజాతర కన్నులపండువగా జరుగుతోంది. భక్తుల రద్దీతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని రేవంత్​ సమర్పించుకున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు మేడారం జాతర ప్రతీకని వారు తెలిపారు.

దక్షిణాది కుంభమేళా మేడారం జాతర అని టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడారం జాతరను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గుర్తించడం లేదన్న రేవంత్​.. రాజులు, చక్రవర్తులపై పోరాడిన చరిత్ర సమ్మక్క- సారలమ్మదని అన్నారు. సమ్మక్క- సారలమ్మ వైపు సీఎం కన్నెత్తి చూడలేదని రేవంత్​ మండిపడ్డారు. ముచ్చింతల్‌ దర్శనానికి ప్రధాని, సీఎం వెళ్తారు కానీ.. సమ్మక్క- సారలమ్మను మాత్రం అవమానిస్తారా అంటూ విమర్శించారు.

ములుగు జిల్లాకు సమ్మక్క- సారలమ్మ పేరు పెట్టాలని రేవంత్​ రెడ్డి డిమాండ్​ చేశారు. శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు ఇచ్చే ప్రాధాన్యం ఆదివాసీల పండుగకు ఇవ్వరా అని ప్రశ్నించారు. మేడారం జాతరకూ జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందేనని.. హోదా కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వాలని రేవంత్​ డిమాండ్​ చేశారు. నివేదికను కేంద్రం ఆమోదించి జాతీయ హోదా ప్రకటించాలని ఆయన కోరారు.

సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలి..

దక్షిణాది కుంభమేళా మేడారం జాతర. మేడారం జాతరను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గుర్తించడం లేదు. రాజులు, చక్రవర్తులపై పోరాడిన చరిత్ర సమ్మక్క- సారలమ్మది. ములుగు జిల్లాకు సమ్మక్క- సారలమ్మ పేరు పెట్టాలి. శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలి. మేడారం జాతరకూ జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే. హోదా కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి నివేదికివ్వాలి. నివేదికను కేంద్రం ఆమోదించి జాతీయ హోదా ప్రకటించాలి.

-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్​

భారీగా తరలివస్తున్న భక్తులు

మరోవైపు మేడారం వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. గురువారం సమ్మక్క తల్లి కొలువు దీరింది. నలుగురూ గద్దెలపై ఆశీనులవడంతో శుక్రవారం వన దేవతల నిండు జాతరకు జనం పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. జంపన్నవాగు తీరమంతా భక్త ప్రవాహమైంది. గద్దెలపై కొలువుదీరి మొక్కులు అందుకుంటున్న అమ్మవార్లు ఇవాళ సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వనదేవతల దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.

'మేడారం జాతరకూ జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే'

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details