ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం దర్శించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేపట్టినప్పుడు సమ్మక్క-సారలమ్మల ఆశీర్వచనాలు పొంది ఉద్యమాలు చేశామని.. అందుకే ఈ తల్లుల ఆశీస్సులతో తెలంగాణ సాధించామన్నారు.
'జాతీయ హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి' - తెజస అధ్యక్షుడు కోదండరాం వార్తలు
తెలంగాణ కుంభమేళ మేడారానికి జాతీయ హోదా కల్పించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ఇవాళ సమ్మక్క సారలమ్మలను ఆయన దర్శించుకున్నారు.
'జాతీయ హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి'
మేడారం మహా జాతరకు రోజురోజుకు వేలాది భక్తులు వస్తున్నారని కోదండరాం అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:సమత హత్యాచార కేసు నిందితులకు మరణ శిక్ష