ములుగు జిల్లా మేడారంలో ఎక్కడ చూసిన జనమే. తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులతో జాతర ప్రాంగణం నిండిపోయింది. గంటగంటకు పెరిగిపోతున్న భక్తులతో కళకళలాడుతోంది. ఇవాళ కన్నెపల్లి నుంచి శ్రీ సారలమ్మ తల్లి మేడారం గద్దెలకు బయలుదేరింది. గిరిజన పూజారుల ప్రత్యేక పూజలను అందుకున్న అమ్మవారు భద్రత బలగాల నడుమ గద్దె మీదకు వస్తుంది. సారలమ్మతో పాటు పడిగిద్ద రాజు, గోవింద రాజు కూడా గద్దెపైకి వస్తున్నారు.
కిక్కిరిసిన మేడారం.. కాసేపట్లో గద్దె మీదకు సారలమ్మ తల్లి.. - ములుగు జిల్లా
మేడారం జాతరలో కీలక ఘట్టాలకు తెరలేచింది. సారలమ్మ తల్లిని కన్నెపల్లి నుంచి వైభవంగా గద్దెల మీదకు తీసుకొస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో... మేడారం జనసంద్రమైంది.
గద్దెలవైపు బయలుదేరిన శ్రీ సారలమ్మ తల్లి
Last Updated : Feb 5, 2020, 11:17 PM IST