Laknavaram Cheruvu : పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన ములుగు జిల్లా లక్నవరం సరస్సు.. పర్యాటకులు లేక వెలవెలబోతోంది. మేడారం మహా జాతర సందర్భంగా లక్నవరానికి పోలీసులు దారులు మూసేశారు. ప్రతి రోజూ వందలాది మందితో కళకళలాడే సరస్సు ప్రాంగణాలు.. అనుమతి లేకపోవడంతో బోసిపోయాయి. జాతరకు వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో లక్నవరానికి వెళ్తే.. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారముందనే భావనతో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆ మార్గాన వెళ్లనివ్వడం లేదు. ఓ వైపు ఈ చర్యలు భక్తులు క్షేమంగా ఇంటికి చేరుకోవడానికే నిర్దేశించినవయినా.. మేడారంతో పాటు లక్నవరం అందాలను వీక్షించవచ్చనే ఆశతో వచ్చే పర్యాటక ప్రియులకు కొంత నిరాశను కలిగిస్తున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు...
వెలవెలబోయిన పర్యాటక స్వర్గధామం.. జాతర దృష్ట్యా లక్నవరానికి నో ఎంట్రీ
Laknavaram Cheruvu : మేడారం మహాజాతర వేళ పోలీసులు తీసుకున్న చర్యలు... కొంత మందికి నిరాశ కలిగించినా సత్ఫలితాలనే ఇస్తున్నాయి. వాహనాలు భారీగా వస్తాయనే ఉద్దేశంతో.. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వరంగల్ నుంచి మేడారం వరకు 100 కిలోమీటర్ల దూరంలో రెండు కిలోమీటర్లకు ఒక ఔట్‌పోస్టు పెట్టారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాల వైపు జనం వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో వరంగల్- ములుగు మార్గంలో ఉన్న లక్నవరం ప్రాంతం పర్యాటకులు లేక వెలవెలబోతోంది.
లక్నవరం