తెలంగాణ

telangana

ETV Bharat / state

RAMAPPA: ఆ గుర్తింపు వస్తే.. ప్రపంచ ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రామప్ప!

అద్భుత శిల్ప సంపదకు నెలవైన చారిత్రక రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ హోదా కోసం యునెస్కోకు నామినేట్‌ అయింది. చైనాలో ఈ నెల 16 నుంచి 31 వరకు జరిగే వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 44వ సమావేశంలో నిపుణులు.. రామప్ప వివరాలను పరిశీలించనున్నారు. రామప్పకు వారసత్వ గుర్తింపు లభిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పర్యాటక క్షేత్రంగా అవతరిస్తుంది.

త్వరలోనే ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రామప్ప దేవాలయం!
త్వరలోనే ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రామప్ప దేవాలయం!

By

Published : Jul 4, 2021, 4:33 PM IST

Updated : Jul 4, 2021, 5:15 PM IST

త్వరలోనే ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రామప్ప దేవాలయం!

ప్రసిద్ద రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన రామప్ప.. అపురూప శిల్ప సంపదకు ప్రసిద్ధి. కన్ను ఆర్పకుండా చేసే శిల్పాలు, అరుదైన లేత ఎరుపు రాతి నిర్మాణం.. శాండ్‌బాక్స్ సాంకేతికత, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం... వంటి ఎన్నో ప్రత్యేకతలు రామప్ప సొంతం.

2019లోనే యునెస్కో ప్రపంచ వారసత్వ పోటీకి.. కేంద్రం నామినేట్ చేయగా.. యునెస్కో ప్రతినిధి రామప్ప ఆలయాన్ని సందర్శించి.. అన్ని అర్హతలున్నట్లు నివేదిక ఇచ్చారు. 2020 జులైలో యునెస్కో హెరిటేజ్ ప్రతినిధులు సమావేశం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత కాకతీయ హెరిటేజ్, కేంద్ర పురావస్తు శాఖ రామప్ప విశిష్టతలను తెలియజేస్తూ ఆలయానికి సంబంధించిన మరింత సమాచారంతో పుస్తకం రూపొందించి.. పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. ఇటీవలే రామప్ప ఆలయ ప్రాముఖ్యతను 6 భాషల్లో తెలియజేస్తూ.. చిత్రీకరించిన దృశ్యాలనూ పంపించారు.

ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 16 నుంచి 31 వరకు చైనాలో యునెస్కో ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు ఆన్‌లైన్‌లో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు ఆదేశాలతో గత నెల 23న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.. కాకతీయ హెరిటేజ్ సభ్యుల బృందం దిల్లీలో పర్యటించింది.

ఏకైక కట్టడంగా రామప్ప..

కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో పాటు ఇతర అధికారులను కలిసి రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సానుకూలంగా స్పందించడం, తేదీలు ఖరారు కావడంతో.. ఇక రామప్ప వారసత్వ గుర్తింపునకు అడుగు దూరంలోనే నిలిచినట్లైంది. ఆ గుర్తింపు లభిస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న ఏకైక కట్టడంగా రామప్ప ఖ్యాతిని గడించనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషితో రామప్పకు పూర్వ వైభవం లభిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. అన్ని పరిశీలనలు పూర్తయ్యాయని తెలిపారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రామప్పకు వారసత్వ గుర్తింపు తప్పక లభిస్తుందని ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.

Love marriage: ఎల్లలు దాటిన ప్రేమ.. కరోనా అడ్డుకున్నా ఒక్కటైంది.!

Last Updated : Jul 4, 2021, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details