ములుగు జిల్లా ఇంచర్ల శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతున్న చారుమజుందార్ మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మావోయిస్టులు కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పటేల్ ఆదేశాల మేరకు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను, కొత్త వ్యక్తులను విచారిస్తున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు
చారుమజుందార్ వారోత్సవాల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లాలో ఈరోజు వాహనాల తనిఖీ చేపట్టారు.
పోలీసుల తనిఖీలు