ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావటం వల్ల అమ్మవార్లను దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పిస్తున్నారు.
మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు - Pilgrims worshiping Medaram
మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావటం వల్ల పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవార్లకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి గద్దెల వద్ద కోలాహలం కన్పిస్తుంది. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇదీ చూడండి:పద్దు 2020 : బడ్జెట్ లైవ్ అప్డేట్స్