వర్షం పడితే చాలు ప్రకృతి ప్రేమికుల మనసంతా... జలపాతాలు, సెలయేర్లు, నదులు, చెరువుల చుట్టూ తిరుగుతుంటుంది. ఎప్పుడెప్పుడు ఇవన్నీ నిండి పొంగిపొర్లుతాయా వాటి అందాలను ఎప్పుడెప్పుడు ఆస్వాదిస్తామా అని వేచి చూస్తూంటారు. వారి కోరిక తీర్చేందుకు ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతూ ప్రకృతి ప్రేమికులను రారమ్మంటోంది. ఛత్తీస్గఢ్లో కురిసిన భారీ వర్షాలతో జలపాతం కొత్త నీటితో పొంగి పొర్లుతోంది. ఉద్ధృతమైన జలధారతో కనువిందు చేస్తోంది.
పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం - BOGATHA
ఛత్తీస్గఢ్లో కురిసిన వర్షాలకు తెలంగాణ జలపాతం బొగత గలగలమంటూ ఉరకలు వేస్తోంది. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటూ కొత్తనీటితో నూతన కళ సంతరించుకుంది.
పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం