ములుగు జిల్లా దేవనగరంలో ఓ వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. దేవనగరంలో కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో ఏడుకొండలు, భిక్షపతి అనే ఇద్దరు కూలీలు పనికోసం చేరారు. బుధవారం అర్ధరాత్రి ఏడుకొండలు దారుణ హత్యకు గురయ్యాడు. తోటి కార్మికుడే ఏడుకొండలును హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. తాపీ మేస్త్రీ భిక్షపతి... తన భార్యతో ఏడుకొండలు తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడనే అనుమానంతో తాగిన మైకంలో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ములుగు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్యతో మాట్లాడుతున్నాడనే అనుమానంతో దారుణ హత్య
తన భార్యతో మాట్లాడుతున్నాడనే అనుమానంతో తోటి కార్మికుడిని ఓ వ్యక్తి దారుణంగా పొడిచి చంపిన ఘటన ములుగు జిల్లా దేవనగరంలో చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్యతో మాట్లాడుతున్నాడనే అనుమానంతో దారుణ హత్య
Last Updated : Dec 26, 2019, 8:04 PM IST