తెలంగాణ

telangana

ETV Bharat / state

'ములుగు వెలుగు' పేరుతో గ్రామాల్లోనే ప్రజావాణి - PRAJAVABNI

'ములుగు వెలుగు' పేరుతో గ్రామ స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.

'ములుగు వెలుగు' పేరుతో గ్రామాల్లోనే ప్రజావాణి

By

Published : Jun 10, 2019, 4:18 PM IST

ములుగు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ములుగు వెలుగు పేరుతో గ్రామాల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మల్లంపల్లి గ్రామంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి హాజరయ్యారు. గ్రామస్థుల నుంచి తీసుకున్న వినతి పత్రాలను ఆయా శాఖల అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఆ సమస్యలకు పరిష్కారం దొరికే వరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

'ములుగు వెలుగు' పేరుతో గ్రామాల్లోనే ప్రజావాణి

ABOUT THE AUTHOR

...view details