ఇటీవల కురిసిన వర్షాల వల్ల ములుగు జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వర్షం వల్ల రోడ్లు, పంటలు, వ్యక్తిగత ఆస్తులకు కలిగిన నష్టాన్ని అంచనా వేసి త్వరలోనే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె అన్నారు.
'వర్షం వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది' - ములుగులో మంత్రి సత్యవతి రాఠోడ్ సమావేశం
ములుగు జిల్లాలో వర్షానికి జరిగిన నష్టంపై మంత్రి సత్యవతి రాఠోడ్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తినష్టాన్ని అంచనా వేసి.. బాధితులను త్వరలోనే ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ-ఫేస్ విద్యుత్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
కొవిడ్-19 కట్టడి నేపథ్యంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు చేసిన సేవలను మంత్రి కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో త్రీ-ఫేస్ కరెంట్ లేక గిరిజన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇప్పటికైనా త్రీ- ఫేస్ విద్యుత్‌ను అందించి.. ఏజెన్సీ ప్రాంతాల్లో వెలుగు నింపాలని మంత్రి సత్యవతి రాఠోడ్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి :'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'