MLC Kavitha Visit Ramappa Temple: రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రామప్ప డెవలమెంట్ అథారిటీని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అథారిటీ ద్వారా ఆలయ పరిసరప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు . మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ములుగులోని గట్టమ్మ దేవాలయం, రామప్ప ఆలయాన్ని కవిత దర్శించుకున్నారు. రుద్రేశ్వర స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామప్ప ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు: కవిత - రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
Minister Satyavathi Rathod and MLC Kavitha Visit Ramappa: ములుగు జిల్లా పాలంపేట రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వర స్వామిని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. దేవాలయ సందర్శనానికి వచ్చిన పర్యాటకులు, విద్యార్థులు వారితో మాట్లాడుతూ సెల్ఫీలు దిగారు.
గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగును జిల్లాగా ఏర్పాటు చేయడమే కాకుండా.. వైద్యకళాశాల సైతం మంజూరుచేశారని కవిత పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని మన రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి పర్యాటకులు రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన గ్రామ దేవాలయాన్ని రాజకీయ నాయకులు, మేధావులు పలు రకాల ప్రముఖులు రామప్ప దేవాలయంలో ఉన్న శిల్ప సంపదలను చూసి ఆశ్చర్య పడుతున్నారు.
ఇవీ చదవండి: