ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గత నాలుగు రోజుల క్రితం జాతీయ రహదారికి ఇరువైపులా గల కల్వర్టుపై నుంచి పడి మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు.
కల్వర్టు పైనుంచి పడి మతిస్థిమితం లేని వ్యక్తి దుర్మరణం - ములుగు జిల్లా వార్తలు
మతిస్థిమితం లేని వ్యక్తి కల్వర్టు పైనుంచి పడి చనిపోయిన ఘటన ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కల్వర్టు పైనుంచి పడి మతిస్థిమితం లేని వ్యక్తి దుర్మరణం
అయితే ఆ మృతదేహం ఓ మతిస్థిమితం లేని వ్యక్తిదని.. గత కొన్ని రోజులుగా దేవాలయం సమీపంలోని తిరుగుతూ జీవనం గడిపే వాడని స్థానికులు తెలిపారు. రాత్రి సమయంలో పడుకోడానికి కల్వర్టుపైకి వెళ్లి కింద పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి:మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!