ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి బ్రింగ్ ఏ స్మైల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రిచర్డ్, ఆర్వీ ప్రసాద్‌ల సహకారంతో సమారిటన్స్ ఫర్ ద నేషన్ ఎన్జీవో సాయం చేసింది. కరోనా బాధితుల చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిమీటర్లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లౌజ్‌లను ఆ సంస్థ ప్రతినిధులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి సమక్షంలో అందించారు.
ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరికరాలు అందించిన దాతలు - తెలంగాణ వార్తలు
ములుగు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి దాతలు వైద్య పరికరాలను అందజేశారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లౌజ్‌లను అందించారు. దాతల సాయంపై ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
ములుగు ఆస్పత్రికి వైద్యపరికరాలు, ఎమ్మెల్యే సీతక్క
నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లా అభివృద్ధికి సాయం చేస్తూ… కరోనా నియంత్రణకు వైద్య పరికరాలను అందించడం పట్ల ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలను అభినందించారు.
ఇదీ చదవండి:ఆగని మరణాలు- మరో 4,194 మంది వైరస్‌కు బలి